దేశంలో లగ్జరీ ఇళ్లకు అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ ఢిల్లీలోని గురుగ్రామ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌పై ఫ్రీ-లాంచ్ ప్రకటించింది. అలా అనౌన్స్ చేసిందో లేదో ఇలా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడ్డారు. కేవలం 72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడు పోయాయి.
ఢిల్లీతో పాటు ముంబైలో ఖరీదైన ప్లాట్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నాయి. తాజాగా, ముంబైలో ఓ లగ్జరీ ప్లాట్ అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ విలువ అక్షరాల రూ.116.42 కోట్లు. ఇంతకి ఆ ప్లాట్‌ను కొనుగోలు చేసింది ఎవరని అనుకుంటున్నారా?
49వ ఫ్లోర్‌లో ఇల్లు
ప్రముఖ లగ్జరీ హోం డెకోర్ కంపెనీ మైసన్ సియా ఫౌండర్, అండ్ సీఈఓ ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా ఆకాశ హర్మ్యాలను తాకుతూ ముంబైలోని లోయర్ పారెల్ ప్రాంతంలో 52 ఫ్లోర్‌లతో నిర్మించిన త్రీసిక్స్టీ వెస్ట్‌లో ఓ ప్లాన్‌ను సొంతం చేసుకున్నారు. 49వ ఫ్లోర్‌లో 12,138 స్కైర్ ఫీట్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌లో సుమారు 8 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది.
వ్రాతికా గుప్తా ఎవరు?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ,పెర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్‌లో పూర్వ విద్యార్థిని వ్రాతిక గుప్తా. అంజుమన్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌లో అపెరల్ డిజైనర్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన వృత్తిని ప్రారంభించారు. 2009 నుండి 2011 వరకు అంజూమోడీ డిజైనర్‌గా, టూ వైట్ బర్డ్స్‌లో డిజైన్ డైరెక్టర్‌గా పని చేశారు. 2017లో వస్త్రప్రపచంలోకి అడుగు పెట్టారు వ్రాతిక. వ్రాతిక & నకుల్‌ని స్థాపించారు. భర్త నకుల్ అగర్వాల్‌తో కలిసి భారతీయ వారసత్వం ఉట్టిపడేలా బ్రాండెడ్ డిజైన్లను తయారు చేస్తున్నారు. 2022లో మైసన్ సియా అనే లగ్జరీ హోమ్ డెకర్ బ్రాండ్‌తో రియల్ ఎస్టేట్‌లో విభాగంలో రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment