
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి స్వల్పలాభాలకు పరిమితమయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరి అర్థగంటలో రీబౌండ్ అయ్యాయి. సెన్సెక్స్22 పాయింట్ల స్వల్ప లాభంతో 38607 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో 11596 వద్ద ముగిశాయి. మెటల్, రియల్టీ, ఐటీ 1.1-0.7 శాతం మధ్య నీరసించగా.. ఎఫ్‌ఎంసీజీ, ఆటో 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి
ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, డా. రెడ్డీస్, ఆర్‌ఐఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ బాగా నష్టపోయాయి. ఇంకా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, వేదాంతా, ఎన్‌టీపీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు దారితీసింది.