
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ముంబైలోని తన ఆస్తుల్లో ఒకటైన ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. బాంద్రా వెస్ట్‌లోని శివ్ అస్థాన్ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున సల‍్మాన్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడని పలు నివేదికలు తెలిపాయి. బాంద్రా బ్యాండ్ స్టాండ్‌కు సమీంపలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తులో 758 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లాట్‌ను 33 నెలలకు గాను అద్దెకు ఇస్తున్నట్లుగా డిసెంబర్ 6న ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పత్రాలు Zapkey.com వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు మనీ కంట్రోల్ తెలిపింది. అలాగే ఈ ఒప్పందంలో 5% ఎస్కలేషన్ నిబంధన ప్రకారం అద్దెదారు రూ. 2.85 లక్షలు డిపాజిట్ చెల్లించాడట.
సల్మాన్‌కు ముంబై పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆస్తులు ఉన‍్నాయి. అతను బాంద్రాలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నెలకు రూ. 8.25 లక్షల ధరకు డూప్లెక్స్ ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మక్బా హైట్స్‌లోని 17, 18వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ బాబా సిద్ధిక్, జీషన్ సిద్ధిక్‌లు కొనుగోలు చేసినట్లు పత్రాల్లో ఉందని సమాచారం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఒప్పందాన్ని పునరుద్ధరించాడట. సల్మాన్ తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక వన్ బీహెచ్‌కే ఇంట్లో నివసిస్తున్నాడని మహేష్ మంజ్రేకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే సల్మాన్‌కు నగర శివారైన పన‍్వెల్‌లో ఒక ఫామ్‌హౌజ్ ఉందని తెలిపాడు.
ఒక ఇంటర్వూలో సిద్ధార్థ్ కన్నన్‌తో సల్మాన్ గురించి మహేష్ మాట్లాడుతూ 'సల్మాన్ ఎక్కడ ఉంటారో మీకు తప్పక తెలిసే ఉంటుంది. అది ఒక వన్ బీహెచ్‌కే ఫ్లాట్. నేను ఆయన ఇంటికి వెళ్లినప్పుడు సగం సమయం అతను డ్రాయింగ్ రూమ్‌లోని ఒక సోఫాలో పడుకుని ఉన్నాడు. ఇంతటి సక్సెస్‌ఫుల్ పర్సన్ వెనుక ఇంతటి మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోయాను.' అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment