
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ఉన్నప్పటికీ ఆ తరువాత కొనుగోళ్ల సందడి నెలకొంది. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి. అయితే కీలక మద్దతు స్థాయిలకుపైన ముగియడం విశేషం. సెన్సెక్స్ 8 పాయింట్ల స్పల్ప నష్టంతో 53018 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 15780 వద్ద పటిష్టంగా ముగిసాయి.
ఆటో, పీఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్ షేర్లు నష్టపోగా, పవర్ , బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బజాజ్ ఆటో, సిప్లా, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment