
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బలహీనతకొనసాగుతోంది. ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 48603 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పతనమై 14602 వద్ద కొనాసగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ భారీగా నష‍్టపోతుండగా ఫార్మా స్టాక్స్ కూడా బలహీనంగా ఉన్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ సన్ ఫార్మా ఒక్కొక్కటి 1-3 శాతం నష్టపోయాయి. మరోవైపు మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో నికర లాభాలు భారీ క్షీణతను నివేదించిన టాటా కెమికల్స్ షేర్లు 7 శాతానికిపైగా నష్టపోయింది. అయితే బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరు మారకంలో రూపాయి 73.95 వద్ద ఫ్లాట్ ట్రేడవుతోంది.