
సాక్షి, ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఒడిదొడుకులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతో ముగిసాయి. రోజంతా స్తబ్దుగా కొనసాగిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 39839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభాలకు పరిమితమై 11916వద్ద ముగిసింది. అయితే 11900 స్థాయిని నిలబెట్టుకుంది.
యూరోపియన్ దిగుమతులపై 2 బిలియన్ డాలర్ల టారిఫ్‌లను విధించనున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు, ఆసియాలో బలహీన ట్రెండ్ నెలకొంది. మరోవైపు మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది.
ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, రియల్టీ స్వల్పంగా లాభపడగా, ఫార్మా, ఐటీ నష్టాలతో ముగిశాయి. ఇండస్‌ఇండ్, ఐబీ హౌసింగ్, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, జీ, ఐవోసీ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐషర్, వేదాంతా, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యూపీఎల్, సిప్లా, విప్రో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.