
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులమధ్య కొనసాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి.వరుసగా ఐదో రోజు నష్టాలనెదుర్కొన్నాయి. నవంబర్ 2020 నుండి కనిష్ట స్థాయికి కోలుకుని, సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసాయి.చివరికి సెన్సెక్స్ ఇండెక్స్ 38 పాయింట్ల నష్టంతో 57,108 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 9 పాయింట్లు నష్టంతో 17,007వద్ద ముగిసింది.
టాటా స్టీల్, టైటాన్, ఎస్‌బిఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సిఎల్ టెక్,నెస్లే ఇండియా లాభపడ్డాయి.