సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. రికార్డు స్తాయిల వద్ద కీలక సూచీలు కన్సాలిడేట్ అవుతున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా ఎసిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 145 పాయింట్లు క్షీణించి 52189 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు నష్టంతో 15694 వద్ద కొనసాగుతోంది. తద్వారా 15700 స్థాయికి కోల్సోయింది. మెటల్, ఎనర్జీ, బేసిక్ మెటీరియల్స్ బ్యాంకింగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఐటిసీ, లాభాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలతో మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. ప్రస్తుతం హిందాల్కో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్‌బీఐ లైఫ్, టాటా స్టీల్, ఒఎన్‌జిసి, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి ,ఎస్‌బీఐ నష్టపోతున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.186 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 984 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment