
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 37541 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 11118 వద్దకొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నేడు కీలక సూచీలు రెండూ ఊగిసలాట మధ్య కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా. ఫార్మ, ఆటో తప్పదాదాపు అన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి.
ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ , ఎన్‌టీపీసీ, మారుతి లాభపడుతున్నాయి. బలహీన త్రైమాసిక ఫలితాల అంచనాలతో టైటన్ భారీగా నష్టపోతోంది. యస్ బ్యాంకు తాజాగా మరో 8 శాతం కుప్పకూలింది. దీంతోపాటు హెచ్‌సీఎల్, టీసీఎస్, యూపిఎల్, గ్రాసిం,యాక్సిస్, సన్ ఫార్మ, ఓఎన్‌జీసీ నష‍్టపోతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ బలహీనంగా ఉంది. బుధవారం ఉదయం 16 పైసల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. సోమవారం నాటి 71.02తో పోలిస్తే 71.18 వద్ద వుంది. కాగా మంగళవారం విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు.