
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ముఖ్యంగా ఆసియా మార్కెట్లు రికార్డు లాభాలతో ఉంటే, దలాల్ స్ట్రీట్ మాత్రం చిన్న బోయింది. ముఖ‍్యంగా ద్రవ్యోల్బణం ధరల షాక్‌తో కీలక సూచీలు రెండూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు నష్టంతో 41791 వద్ద, నిఫ్టీ పాయింట్లు 11 బలహీనతతో 12319 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ , ఆటో రంగాలు నష్టపోతున్నాయి.
సన్‌ఫార్మా, టీసీఎస్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్‌టెల్,ఎన్‌టీపీసీ లాభపడుతుండగా , యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రబ్యాంకు, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు చల్లబడటంతో ఆయిల్ రంగ షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.