
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిసాయి. శుక్రవారం మిడ్‌సెషన్‌లో బాగా నష్టపోయిన సూచీలు చివరికి స్పల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 87పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 61,663, నిఫ్టీ 36 లేదా 0.2 శాతం క్షీణించి 18,308 వద్ద ముగిసింది.
దాదాపు అన్నిరంగాల షేర్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభ పడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర టాప్ విన్నర్స్‌గా నిలవగా ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, సిప్లా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 6పైసల నష్టపోయి 81.70వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment