సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గరిష్టాలనుంచి వెనక్కి తగ్గాయి. రియల్టీ సూచికలలో భారీ అమ్మకాల ఒత్తిడి మధ్య ఆరంభ లాభాలనుంచి కీలక సూచీలు ఫ్లాట్‌గా మారాయి. దీంతో సెన్సెక్స్ 41 వేల దిగువకు చేరింది. అయితే నిఫ్టీ మాత్రం 12070కి ఎగువన కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 101 పాయింట్లు ఎగిసి 40923 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 12075 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ మినహా ఐటి, ఆటో, మీడియా లాభపడుతున్నాయి. మెటల్, ఫార్మా స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యుపిఎల్, టాటా మోటార్స్ మారుతి లాభపడుతుండగా, సిప్లా, ఎల్ అండ్ టీ, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment