
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. దాదాపు ఈ వారమంతా లాభాల్లోనే సాగిన మార్కెట్లు వారాంతంలో బలహీనంగా ఉన్నాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 69 పాయింట్లు క్షీణించి 41239 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 12124 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోను ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. హీరో మోటో, ఎన్‌టీపీసీ, టైటన్, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, బజాజ్ ఆటో, ఏషియన పెయింట్స్ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సన్‌ఫార్మ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, రిలయన్స్, కోటక్ మహీంద్ర నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
అటు డాలరు మారకంలో రూపాయి 71.26 వద్ద బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. గురువారం నాటి ముగింపు 71.19 తో పోలిస్తే శుక్రవారం ఉదయం 6 పైసలు క్షీణించింది.