
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం నాటి భారీ ర్యాలీకి చెక్ పెట్టిన సూచీలు సోమవారం ఆరంభంలో నష్టాలను చూశాయి. 76 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్ ఆ తరువాత 150 పాయింట్లకు పైగా ఎగిసింది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఫార్మరంగ షేర్ల నష్టాలుమార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 65 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.
టాటా స్టీల్, పవర్‌గ్రిడ్,ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. అలాగే హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్య్లూ స్టీల్, బజాజ్ ఆటో లాభపడుతుండగా డా.రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు నష్టపోతున్నాయి.
ఎగిసిన రూపాయి
అటు మారకంలో రూపాయి ఆరంభంలోనే 25పైసలు ఎగిసిన రూపాయి 80.53 స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment