
సాక్షి,ముంబై: తీవ్ర ఒడిదుడుకుల మధ్యసాగిన దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఆరంభ లాభాలన్నీ అవిరైపోయాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు లాభంతో 35697 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 10458 వద్ద ముగిసాయి. సోమవారం నాటి భారీ నష్టాలు, మంగళవారం హోలీ సెలవు తరువాత బుధవారం ఆరంభంలో నష్టాలను చవి చూశాయి. వెంటనే పుంజుకుని 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ మిడ్ సెషన్‌నుంచి లాభాలను నిలబెట్టుకోలేక నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే యస్‌బ్యాంకు ఏకంగా 36శాతం జంప్ చేయగా, సోమవారం నాటి భారీ నష్టాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడింది. గెయిల్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, హిందాల్కో, ఎస్‌బీఐ. ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతి ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా, హీరోమోటో, రిలయన్స్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంకు లాభపడ్డాయి.