
సాక్షి, ముంబై: రెండు రోజుల లాభాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండు రోజుల లాభాలకుచెక్ చెప్పాయి. గురువారం ఆరంభంలో 200 కుప్ప కూలినా, ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 42 పాయింట్లు 59290వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 17650వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది.
టాటా స్టీల్, ఎన్టీజీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యు స్టీల్,ఎన్టీపీసీలాభపడుతున్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, నెస్లే నష్టపోతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ ఇంకా చాలా చేయాల్సి ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి.