
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 78 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 15,725 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మూడు రోజుల భారీ నష్టాల తరువాత ప్రస్తుతం కీలక సూచీలు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.
యూఎస్‌ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు, ఆందోళన, ప్రపంచ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి. హింద్‌మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్, అదానీ పవర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్,బజాజ్ ఆటో లాభాల్లోనూ, టాటా స్టీల్, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్రిటానియా టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.