
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. రోజంతా పటిష్టంగా కదలిన స్టాక్‌మార్కెట్ వారాంతంలో మిశ్రమంగా స్థిరపడింది. డే హై నుంచి 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 51544 వద్ద,నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15163 వద్ద ముగిసాయి. దీంతో నిఫ్టీ 15200దిగువన ముగిసినట్టైంది. అయితే నిఫ్టీ బ్యాంకు ఒక శాతం లాభపడటం విశేషం. బ్యాంకింగ్, ఐటీ, రియల్టీరంగ షేర్లు లాభపడగా, మెటల్, ఫార్మా, ఎఫ్‌ఎసీజీ నష్టపోయాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్ లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయికి చేరింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల దెబ్బతో ఐటీసీ భారీ నష్టాలను మూట గట్టుకుంది. ఐటీసీ నికరలాభం 12 శాతం పడిపోయి 3,663 కోట్ల రూపాయలకు చేరుకుంది. కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్ నష్టాల్లో ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment