కొత్త ఫ్లాట్ కొన్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. రేటు ఎంతంటే? | Mrunal Thakur Buys Kangana's Family Flat In Andheri | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఫ్లాట్ కొనేసిన మృణాల్.. ఇది ఎవరిదో తెలుసా?

Feb 20 2024 8:46 PM | Updated on Feb 21 2024 9:35 AM

Mrunal Thakur Buys Kangana Flat In Andheri - Sakshi

'సీతారామం', 'హాయ్ నాన్న' తదితర చిత్రాలతో తెలుగులో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె ముంబయిలోని ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఫ్లాట్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ ఫ్యామిలీది కావడం విశేషం.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!)

ముంబయికి చెందిన మృణాల్ ఠాకుర్.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్‌లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది. ఉన్నంతలో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2022లో 'సీతారామం' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి సౌత్‌లో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆచితూచి ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పటికీ అవన్నీ మృణాల్‌కి మరింత పేరు తెచ్చి పెడుతున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేసింది. గతంలో ఇది హీరోయిన్ కంగనా రనౌత్ తండ్రి-సోదరుడికి సంబంధించినది. ఇప్పుడు దీన్ని మృణాల్ సొంతం చేసుకుంది. అయితే దీని విలువ ఎంతనేది బయటకు రాలేదు గానీ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఏదైతేనేం మృణాల్ కొత్త ఫ్లాట్ రేటు గురించి ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement