
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలో భారీ లాభాలతో మురిపించినసూచీలు మిడ్ సెషన్ సమయానికి స్తబ్దుగా మారిపోయాయి. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 55769 వద్ద,నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించి 16584 వద్ద స్థిరపడ్డాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగాలు మేజర్‌గా నష్టపోయాయి. రిలయన్స్ 3 శాతం ఎగిసి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇంకా ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, డా. రెడ్డీస్ లాభాలనార్జించాయి.
అటుగ్రాసిం, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్స్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి. విస్తరణలో రూ. 12,886 కోట్ల పెట్టుబడిని ప్రకటించినప్పటికీ అల్ట్రాటెక్ సిమెంట్ నేడు (జూన్ 3న) 6 శాతం కుప్పకూలింది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని తాకింది. అలాగే అంబుజా , రాంకో, ఏసీసీ ఇతర సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.
మరోవైపు డాలర్ ఇండెక్స్ పతనం, సానుకూల దేశీయ ఈక్విటీల మద్దతుతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు పెరిగి 77.47 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. చివరకు 3 పైసలు నష్టపోయి 77.63 వద్ద స్థిరపడింది. గురువారం 77.60 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment