
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ పాయింట్ల 19 పాయింట్లు నష్టంతో, నిఫ్టీ 6 పాయింట్ల బలహీనంగా మొదలయ్యాయి. వెంటనే సూచీలు లాభాల్లోకి మళ్లాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 124 పాయింట్లు, ఎగియగా, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11018 వద్ద కొనసాగుతోంది. టాటామెటార్స్, మారుతి, టైటన్, ఐవోసీ, అదానీపోర్ట్స్ లాభాల్లో కొనసాగుతుండగా, యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ ఫైనాన్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. డాలరు మారకంలో 70.92 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం 70.96 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.