
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ పాయింట్లు 35 బలహీనంతో నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించాయి. అనంతరం సెన్సెక్స్ మరింత దిగజారి 170 పోయింట్లు పతనమై 39వేల దిగువకు, 54 పాయింట్లు క్షీణించి నిఫ్టీ 11650 దిగువకు చేరి బలహీన సంకేతాలందించాయి.
ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై వస్తున్న వార్తలు, కరెన్సీ బలం నేపథ్యంలో ఐటీ నష్టపోతోంది. ఇంకా ఫార్మా , బ్యాంకింగ్, మెటల్ షేర్లు నష్టపోతున్నాయి. విప్రో , టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అడాగ్ షేర్లు నష్టపోతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ, అయిల్ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌గా డాలర బలహీనత కారణంగా దేశీయ కరెన్సీ పాజిటివ్‌గా ఆరంభమైంది. 0.23 శాతం ఎగిసి 69.52 వద్ద కొనసాగుతోంది.