
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నామమాత్రపు లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 40681 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 12006 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. ముఖ్యంగా భారతీయ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ఊరట లభించడంతో టెల్కో షేర్లు గురువారం కూడా లాభపడుతున్నాయి. మీడియా , ఐటీ షేర్లు కూడా లాభపడుతున్నాయి. 13 శాతం ఎగిసి జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ విన్నర్‌గా ఉండగా, సన్ టీవీ లాభాల్లో కొనసాగుతోంది. వీటితోపాటు హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్ లాభపతుండగా, భారతి ఇన్‌ఫ్రాటెల్, బీపీసీఎల్, యస్ బ్యాంకు, సిప్లీ, గెయిల్, కోల్ ఇండియా, గ్రాసిం నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment