
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే స్థిరపడ్డాయి. ఆటో తప్ప మిగిలిన అన్ని రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ ఇండెక్స్ 2.3 శాతం నష్టపోయింది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు నష్టపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లో 300 పాయింట్లకు పైగా నష్టపోయి సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టానికి పరిమితమై 54395 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్లు నష్టంతో 16216 వద్ద ముగిసింది. తద్వారా 16200 స్థాయికిపైన స్థిరపడింది.
ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, టాటాస్టీల్, ఎంఅండ్‌ఎం, డా.రెడ్డీస్ లాభాల్లో ముగియగా, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్‌సీఎయల్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ నష్ట పోయాయి. మరోవైపు దేశీయ కరెన్సీ సోమవారం మరో కొత్త కనిష్టానికి చేరింది. డాలరు మారకంలో రూపాయి తొలుత 79.40 వద్ద మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు దాని మునుపటి ముగింపు 79.26 కంటే 22 పైసలు తగ్గి 79.48 (తాత్కాలిక) వద్ద రికార్డు కనిష్ట స్థాయి ముగింపుతో స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment