
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆర్బీఐ వడ్డీరేటు కోత అంచనాలతో ఆరంభంలోనే 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ అనంతరం స్వల్ప లాభాలకు పరిమితమై కొనసాగుతోంది. 49 పాయింట్ల లాభంతో 38711 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల స్వల్ప లాభంతో11489 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఆయిల్ రంగ షేర్లుమాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్,కోల్ ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్; గ్రాసిం, భారతి ఇన్‌ఫ్రాటెల్ నష్టపోతుండగా బీపీసీఎల్, ఐవోసీ, యస్‌బ్యాంకు, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి.