ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్‌మెంట్‌ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్‌మెంట్‌లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది.
ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్‌లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్‌హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు.
వందేళ్ల నాటిది!
ఈ వన్ బీహెచ్‌కే సాధారణ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్‌కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్‌ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment