Single bedroom
-
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్మెంట్ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్మెంట్లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. వందేళ్ల నాటిది! ఈ వన్ బీహెచ్‌కే సాధారణ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్‌కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు. -
సింహం సింగిల్‌గా వస్తుంది
సమ్‌థింగ్ స్పెషల్ ప్లాట్లలో సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఉంటాయి. అంతే కానీ, సింగిల్ రూమ్‌లో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ వగైరాలు ఉండే ఫ్లాట్లు ఎక్కడా కనిపించవు. కానీ లండన్‌లో అలాంటి ఫ్లాట్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని కొనేందుకు లేదా అందులో అద్దెకు ఉండేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. లండన్‌లోని సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ పైన ఉంది ఆ సింగిల్ రూం ఫ్లాట్. దాన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నా, లేక ఏకంగా ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటున్నా బ్యాగ్ నిండా డబ్బులతో సిద్ధమయిపోవాల్సిందే. ఆ సింగిల్ రూం ధరెంతో తెలుసా? కొనుగోలుకైతే 110వేల పౌండ్లు.. అంటే సుమారు కోటి తొమ్మిది లక్షలు. అద్దెకైతే నెలకు దాదాపు యాభైవేలు. మరీ అంత ఎక్కువ ధరా అనుకునేవారు ఓ సారి ఆ రూం విశేషాలు తెలుసుకుంటే అదేం ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఆ సింగిల్ రూం ఫ్లాట్ మొత్తం కలిపి 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందులోనే కిచెన్, బెడ్రూం, బాత్రూం ఉంటాయి. బాత్రూం బాక్స్లా ఉంటుంది కానీ అందులో టాయిలెట్, సింక్, షవర్ అన్నీ ఉన్నాయి. కిచెన్‌లోనూ సింక్ ఉంది. అలాగే స్పేస్ వృథా కాకుండా ఉండేందుకు ఫోల్డెడ్ టేబుల్ కూడా ఉంది. అసలు ఆ ఫ్లాట్‌కు అంత డిమాండ్ రావడానికి కారణం అది ఆస్పత్రికి, కాలేజీకి దగ్గరగా ఉండటమే. దానిని సోషల్ మీడియాలో సేల్కు పెట్టినప్పటి నుంచి దాని విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదంతా వింటుంటే సింహం సింగిల్‌గా వస్తుంది అనే సినిమా డైలాగ్ గుర్తుకు రావడంలో వింతేముంది? -
ఆర్‌ఏవై కింద డబుల్ బెడ్రూం ఇళ్లు!
కేంద్రానికి టీ సర్కార్ ప్రతిపాదన అదనపు భారాన్ని భరిస్తామని వెల్లడి రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్ట్‌ల కోసం ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక పడక గది ఉండే (సింగిల్ బెడ్ రూమ్) గృహాలను.. రెండు పడక గదులు ఉండే (డబుల్ బెడ్ రూమ్) గృహాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా అయ్యే వ్యయాన్ని తాము భరిస్తామని, ఈ మార్పులకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పేదలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో.. ఆర్‌ఏవై పథకంలో మార్పులు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అయ్యే వ్యయ అంచనాలను సీఎం కార్యాలయం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నుంచి తెప్పించుకుంది. ఆర్‌ఏవై కింద కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా.. అదనపు పడక గది నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ. 7 లక్షలకు పెరుగుతుందని మెప్మా సీఎంవోకు నివేదించింది. దీనిపై సీఎం చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన కోసం గత యూపీఏ ప్రభుత్వం 2009-10లో ఆర్‌ఏవైను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విడుదల కాని రాష్ట్ర వాటా.. ఆర్‌ఏవై కింద నాలుగు ప్రాజెక్టులు మంజూరై రెండేళ్లు గడిచినా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికయ్యే వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, పురపాలక సంస్థ 10 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ. 14.41 కోట్లు విడుదలకాగా... రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు.