సింహం సింగిల్‌గా వస్తుంది | Something Special | Sakshi
Sakshi News home page

సింహం సింగిల్‌గా వస్తుంది

Published Thu, Oct 15 2015 5:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

సింహం సింగిల్‌గా వస్తుంది

సింహం సింగిల్‌గా వస్తుంది

సమ్‌థింగ్ స్పెషల్
 
ప్లాట్‌లలో సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అని ఉంటాయి. అంతే కానీ, సింగిల్ రూమ్‌లో బెడ్‌రూమ్, బాత్‌రూమ్, కిచెన్ వగైరాలు ఉండే ఫ్లాట్‌లు ఎక్కడా కనిపించవు. కానీ లండన్‌లో అలాంటి ఫ్లాట్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని కొనేందుకు లేదా అందులో అద్దెకు ఉండేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. లండన్‌లోని సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ పైన ఉంది ఆ సింగిల్ రూం ఫ్లాట్. దాన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నా, లేక ఏకంగా ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటున్నా బ్యాగ్ నిండా డబ్బులతో సిద్ధమయిపోవాల్సిందే.

ఆ సింగిల్ రూం ధరెంతో తెలుసా? కొనుగోలుకైతే 110వేల పౌండ్లు.. అంటే సుమారు కోటి తొమ్మిది లక్షలు. అద్దెకైతే నెలకు దాదాపు యాభైవేలు. మరీ అంత ఎక్కువ ధరా అనుకునేవారు ఓ సారి ఆ రూం విశేషాలు తెలుసుకుంటే అదేం ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఆ సింగిల్ రూం ఫ్లాట్ మొత్తం కలిపి 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందులోనే కిచెన్, బెడ్‌రూం, బాత్‌రూం ఉంటాయి. బాత్‌రూం బాక్స్‌లా ఉంటుంది కానీ అందులో టాయిలెట్, సింక్, షవర్ అన్నీ ఉన్నాయి. కిచెన్‌లోనూ సింక్ ఉంది. అలాగే స్పేస్ వృథా కాకుండా ఉండేందుకు ఫోల్డెడ్ టేబుల్ కూడా ఉంది. అసలు ఆ ఫ్లాట్‌కు అంత డిమాండ్ రావడానికి కారణం అది ఆస్పత్రికి, కాలేజీకి దగ్గరగా ఉండటమే. దానిని సోషల్ మీడియాలో సేల్‌కు పెట్టినప్పటి నుంచి దాని విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదంతా వింటుంటే సింహం సింగిల్‌గా వస్తుంది అనే సినిమా డైలాగ్ గుర్తుకు రావడంలో వింతేముంది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement