
Harbhajan Singh Sells Apartment in Mumbai For Rs 17.58 crore: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముంబైలో అంధేరిలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.58 కోట్లకు జేబిసీ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పీకి విక్రయించాడు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ "జాప్‌కీ.కామ్" పత్రాల ప్రకారం.. హర్భజన్ 2018 మార్చిలో రూ.14.5 కోట్లకు తన పేరిట అపార్ట్‌మెంట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ లావాదేవీపై 87.90 లక్షల స్టాంప్ డ్యూటీని భజ్జీ చెల్లించాడు.
దాదాపు నాలుగేళ్లలో మూడు కోట్లకు పైగా హర్భజన్ లాభం పొందాడు. కాగా ఈ అపార్ట్‌మెంట్ అంధేరీ వెస్ట్‌లోని రుస్తోమ్‌జీ ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ తొమ్మిదవ అంతస్తులో ఉంది. అదే విధంగా టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబైలోని లోధా వరల్డ్ క్రెస్ట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను 11.85 కోట్లకు కొనుగోలు చేశాడు.
చదవండి: Ind Vs NZ Test Series: మెనూ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ