ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి గాయం బారిన పడ్డాడు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ భుజానికి దెబ్బ తగిలింది. శ్రేయస్ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతను ముంబై తదుపరి ఆడబోయే రంజీ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ముంబై ఈ నెల 26న త్రిపురతో తలపడాల్సి ఉంది. రంజీల్లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని భావించిన శ్రేయస్‌కు గాయాలు పెద్ద సమస్యగా మారాయి.
శ్రేయస్ ఈ ఏడాది ఆగస్ట్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు. అనంతరం అతను జట్టులో స్థానం కోల్పోయి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. శ్రేయస్ ఇటీవలికాలంలో దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్, రంజీ ట్రోఫీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడాడు. గత వారం మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రేయస్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో (142) మెరిశాడు. శ్రేయస్ ఈ రంజీ సీజన్‌లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 57.33 సగటున 172 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో శ్రేయస్ 0, 30 పరుగులు చేశాడు.
చదవండి: పృథ్వీ షాపై వేటు
Comments
Please login to add a commentAdd a comment