
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ బుధవారం చివరి గంటలో నష్టాలను మూటగట్టుకుంది. మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఉత్సాహం చూపటడంతో సెన్సెక్స్ ఒత్తిడికి లోనైంది.
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,730 పాయింట్లతో ప్రారంభమయ్యింది. తొలి గంట సేపు పాయింట్లను పొందుతూ ఒక దశలో గరిష్టంగా 54,758 పాయింట్లను తాకింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు సూచీ ఫ్లాట్‌గానే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువై పోవడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. చివరకు మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 28 పాయింట్లు నష్టపోయి 54,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నష్టాల దిశగా పయణించినా చివరి అరగంటలో కోలుకుంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి కేవలం రెండు పాయింట్లు లాభపడి 16,282 పాయింట్ల వద్ద ఆగిపోయింది.
టాటీ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందగా కోటక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, నెస్టల్ షేర్లు నష్టాలు పొందాయి. బ్యాంకు నిఫ్టీ కిందివైపు 0.63 శాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment