అమ్మకాల ఒత్తిడి: ఫ్లాట్‌గా సూచీలు | Sensex Gains Over 100 Points and turns Flat | Sakshi
Sakshi News home page

అమ్మకాల ఒత్తిడి: ఫ్లాట్‌గా సూచీలు

Published Mon, Jun 7 2021 10:01 AM | Last Updated on Mon, Jun 7 2021 10:07 AM

 Sensex Gains Over 100 Points and turns Flat - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ 180  పాయింట్లు ఎగియగా నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ వెంటనే లాభాలను కోల్పోయి  ఫ్లాట్‌గా మారింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 1 పాయింట్ల లాభాలకు  పరిమితమై  52100 వద్ద, నిఫ్టీ28 పాయింట్లు ఎగిసి 15699 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి.  ఐటీసీ, ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి లాభపడుతుండగా,  బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ , హెచ్‌డిఎఫ్‌సి నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు  మారకంలో దేశీయ  కరెన్సీ  రూపాయి   స్వల్ప లాభంతో ప్రారంభమైంది.  శుక్రవారం నాటి ముగింపు 72.99తో  పోలిస్తే 72. 85  వద్ద కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement