
సాక్షి, ముంబై : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 25 పాయింట్లు పుంజుకుని 39,059 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు నష్టంతో 11,745 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 11750 స్థాయి దిగువకు చేరింది.
ప్రధానంగా ఐటీ , ఫార్మా నష్టపోతుండగా, రియల్టీ 0.4 శాతం పుంజుకుంది. యస్ బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో లాభాల్లోనూ, బ్రిటానియా, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్, విప్రో, జీ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment