
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. తన సినిమాలతో టాలీవుడ్‌లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తాజాగా సూర్య ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ‍్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారట. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అపార్ట్‌మెంట్ ప్రత్యేకతలు
సూర్య కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఫ్లాట్‌లో భారీ గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్‌లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్ ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్‌మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకటించిన 'సూర్య 42' విడుదలకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ తెరకెక్కించారు.ఈ చిత్రం దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా సూర్య మూవీ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్‌లో ప్రధాన పాత్రలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment