సూర్య 'కంగువ' టీజర్‌ విడుదలపై అధికారిక ప్రకటన | Suriya Kanguva Movie Teaser Update Out Now, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

సూర్య 'కంగువ' టీజర్‌ విడుదలపై అధికారిక ప్రకటన

Published Mon, Mar 18 2024 12:27 PM | Last Updated on Mon, Mar 18 2024 12:59 PM

Suriya Kanguva Movie Teaser Update Details Out Now - Sakshi

సూర్య హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్‌ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్‌, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు.

భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను మేకర్స్‌ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్‌ గ్రీన్‌ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్‌ డిఫరెంట్‌గా ఉంది.

త్రీడీ ఫార్మాట్‌లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్‌ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్‌-1 ఇదే 2024లోనే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement