సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా ఉత్సాహంగా మొదలైనాయి. ఒక దశలో డబుల్ సెంచరీకిపైగా లాభాలతో దూసుకుపోయినా, ఆర్‌బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంతో 41211 వద్ద నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 12115 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ప్రధానంగా మెటల్, ఫార్మా, మీడియా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో ఉన్నాయి. జీ, యస్ బ్యాంక్, ఐవోసీ, వేదాంతా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ లాభపడుతుండగా, అయితే టాటా మోటార్స్, టైటన్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్, యూపీఎల్, హిందాల్కో, నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment