సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పనష్టాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ కీలక సూచీలు ఒడిదుడుకుల మధ్య ఉన్నాయి. ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. రియల్టీ, ఆటో స్టాక్‌లు లాభాలు మార్కెట్‌కు సపోర్ట్‌నిస్తున్నాయి. ఫలితంగా ఆరంభంలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో 60977వద్ద ఉంది. , నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 17917 వద్ద ట్రేడ్ అవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ ఈక్విటీల ఆందోళన నేపథ్యంలో అనిశ్చితి కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐషర్ మెటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మారుతి, రిలయన్స్ లాభపడుతుండగా, ఐటీసీ, హెచ్‌యూఎల్, లార్సెన్, ఓఎన్‌జీసీ బ్రిటానియా నష్ట పోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా నష్టాల్లోనే ఉన్నంది. 12పైసల నష్టంతో 82.85 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment