![home Tour Of Tiny 1 BHK Flat In South Mumbai Internet Reacts video - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/7/Tiny-1BHK-Flat-Mumbai.jpg.webp?itok=e5Z8nyyL)
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్‌మెంట్లలో నివసిస్తుంటారు.
ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్‌కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు.
సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్‌మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment