tiny
-
బంగారు ఇల్లు!.. ధర తెలిస్తే గుండె జల్లు (ఫోటోలు)
-
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్‌కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు"
ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు. ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
చిన్నవే కానీ..ప్రాణాలు తీసేస్తాయ్!
-
నిజంగా ఆపిల్ పండు లాంటి బిడ్డ, కట్ చేస్తే..
ఆపిల్‌పండు లాంటి బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్‌లో నిజంగానే యాపిల్ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్(NUH)లో కిందటి ఏడాది జూన్ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించారు ఎన్హెచ్యూ వైద్యులు. 13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డకు వెక్(క్వెక్) యూ గ్జువాన్ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్ యూ గ్జువాన్ ఆ రికార్డును చెరిపేసింది. -
ఈ బుల్లి ఫోన్ ప్రత్యేకతలు వింటే..
సాక్షి, న్యూఢిల్లీ : 'ప్రపంచంలో అతిచిన్న మొబైల్ ఫోన్' ను యుకేకి చెందిన జాంకో లాంచ్ చేసింది. ‘జాంకో టైనీ టీ1’ పేరుతో ప్రారంభించిన ఈ ఫోన్ ఎంత చిన్నదంటే కేవలం మనిషి బొటన వేలంత పొడవు మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఒక కాయిన్ కంటే తక్కువ బరువు వుంటుంది. కేవలం 13 గ్రాములు. ఇందులో సింగిల్ నానో సిమ్ వేసుకోవచ్చు. ఫోన్ బుక్‌లో 300 కాంటాక్ట్స్, 50 మెసేజ్‌లను, 50 కాల్‌లాగ్స్‌ను మాత్రమే స్టోర్ చేసుకునే సదుపాయం. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఈ ఫోన్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2018, మే నెలలో మార్కెట్లోకి రానుంది. ఇక రేటు విషయానికొస్తే సుమారు రూ.2,500. ఇంత ప్రత్యేకమైన ఫోన్లో బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు సహా ఇతర ఫీచర్లు కూడా చాలా ప్రత్యేకమైనవే అని చెప్పాలి. అయితే భారీ స్క్రీన్లు, అద్భుతమైన కెమెరాలతో దూసుకుపోతున్న స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ బుల్లిఫోన్ యూత్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి! టైనీ టీ 1 ఫీచర్స్.. 0.49 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే 32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ మీడియాటెక్ ఎంటీకే 6261డి మదర్‌బోర్డు 2జీ 32 ఎంబీ స్టోరేజ్ 200 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, 3 రోజులు స్టాండ్‌బై, 180 నిమిషాల టాక్ టైం -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
28 ఏళ్ళ తర్వాత అక్కడో శిశువు పుట్టింది..!
ఆ ప్రాంతంలో పిల్లలు పుట్టడమే కరువై... సంవత్సరాలు దాటి పోయింది. నవజాత శిశువులకోసం పరితపించే అక్కడి ప్రజలకు.. దశాబ్దాల తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ళుగా వారు కంటున్న స్వప్నం... వారం క్రితం సాకారమైంది. ఇటలీలోని ఓస్థానా పట్టణంలో 1987 తర్వాత ఏ కుటుంబంలోనూ పిల్లలు పుట్టడమే చూడలేదని, స్థానిక మేయర్ లాంబార్డో చెప్తున్నారు. గతవారం ఓ కుటుంబంలో శిశువు జన్మించడం నిజంగా అద్భుత సన్నివేశమని... దీంతో అక్కడి ప్రజలు ఆనందంలో తేలియాడుతున్నారని ఇటలీ డైలీ న్యూస్ పేపర్ లా స్టాంపా వెల్లడించింది. ఓస్థానాలో పుట్టిన చిన్నారితోపాటు... కేవలం 85 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే ఇక్కడి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజానికి 1975 లో ప్రారంభమై...1976-87 కు మధ్య కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టడం చరిత్రను సృష్టించింది. అప్పట్లో చివరిగా ఓ అబ్బాయి పుట్టినట్లు స్థానిక మేయర్ జియాకోమో లాంబార్డో చెప్తున్నారు. జననాల ట్రెండ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటూ స్థానికంగా ప్రత్యేక వేడుకను కూడా నిర్వహించారు. జనాభా తగ్గిపోవడాన్ని అరికట్టడం ఎంతో కష్టమని, ఆ దిశగా తాము ఎన్నో ఆలోచనలు చేస్తున్నామని లాంబార్డో అంటున్నారు. ముఖ్యంగా యువ ఇటాలియన్లకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం కూడా ఇక్కడ జనాభా తగ్గడానికి కారణమని ఆయన అంటున్నారు. ఉద్యోగాలకోసం ఇక్కడి ప్రజలు అనేకమంది స్వంత ఇళ్ళను కూడా వదిలి నగరాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇటలీలోని ఈ ఓస్థానా పట్టణంలో ప్రస్తుతం ఓ దుకాణం, ఓ బార్, రెండు రెస్టారెంట్లు మాత్రమే ఉన్నట్లు స్థానిక వార్తా వెబ్ సైట్ 'ది లోకల్' ప్రకారం తెలుస్తోంది. ఉత్తర ఇటలీలో కొంత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, దక్షిణ ఇటలీలోని సిసిలీ సహా అన్ని ప్రాంతాలూ తీవ్రమైన భౌగోళిక మార్పులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళనకు గురైన కొందరు స్థానికులు... ఇక్కడి జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైద్యపరీక్షలు చేయించుకొని, మరణాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిసిలీ ద్వీపంలోని గంగి పట్టణంలో గతేడాది మరో ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడి సుమారు 20 గృహాలు రెండు డాలర్లకన్నా అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సుమారు 50 మంది ముందుకొచ్చారు. వీరు తిరిగి వెళ్ళకుండా ఉండేందుకు కొనుగోలుదారుల ఇష్టప్రకారం పునరుద్ధరణకు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం గంగిలో 7 వేల మంది నివాసితులు ఉన్నారు. అయినప్పటికీ ఓస్థానాలో పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడుతుందేమోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఓస్థానాలో జన్మించిన శిశువు పాబ్లో రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇక్కడ తిరిగి పుట్టుక ప్రారంభమవ్వడం గర్వించదగ్గ మార్పు అని మేయర్ లాంబార్డో అంటున్నారు. స్థానిక యువకులు పట్టణం వదిలి ఉద్యోగాలకోసం వలస వెళ్ళకుండా ఆపే తమ ప్రయత్నం క్రమంగా ఫలిస్తోందని, తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం ఉపాధికోసం ఊరు వదిలి వెళ్ళినా.. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడంతో తిరిగి బస చేసేందుకు యువకులు వస్తున్నారని లాంబార్డో చెప్తున్నారు. తమ ప్రయత్నాలతో క్రమంగా జనాభా కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నట్లు ఆయన అంటున్నారు.