ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు.
ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి.
(చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..)
Comments
Please login to add a commentAdd a comment