South Mumbai
-
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్‌కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
వర్లిలో కుమార సంభవమే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ ముంబైలో అందరి దృష్టి వర్లి నియోజకవర్గంపై పడింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో యువ సేనాని ఆదిత్య ఠాక్రే దిగడంతో ఈ సీటుపై చర్చ సాగుతోంది. ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. వర్లి ఎప్పట్నుంచో శివసేనకు కంచుకోట. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. బీజేపీ–సేన కూటమి గెలిస్తే ఆదిత్య ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆదిత్యపై పోటీకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానె దళిత నాయకుడు. ఆయన స్థానిక నేత. పక్కా లోకల్ అన్న ప్రచారంతోనే ఆదిత్యకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వర్లి ఒక మినీ మహారాష్ట్ర ఈ నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొద్ది ఏళ్లలో రూపురేఖలు మారాయి. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. చాల్స్ (ఇరుకు గదులుండే నాలుగైదు అంతస్తుల భవంతులు)లో ఉద్యోగులు ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలు ఇలా ఈ ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రకు నమూనాలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇలా భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం సులభమేమీ కాదు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య ప్రచారంలో ముందున్నారు. ‘సలాం వర్లి’ అంటూ వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ కటౌట్లు ఉంచి మరాఠీయేతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరే కాలనీలో వందల భారీ వృక్షాల నరికివేత, ముంబై నైట్ లైఫ్ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ఆద్యితకు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ మద్దతుపలికారు. ఆదిత్యకు కలిసొచ్చేవి ► బాల్ ఠాక్రే వారసత్వం ► సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం ► ముంబై లైఫ్ వంటి అంశాల ప్రస్తావన ► అభివృద్ధి మంత్రం సురేశ్ మానెకు అనుకూలమివీ.. ► దళిత కార్డు ► లోకల్ ఇమేజ్ ► ఇంటింటికీ తిరగుతూ ప్రజలతో అనుసంధానం ► వివిధ భాషల వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు గతంలో ఫలితాలు ఇలా.. ► 1990 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే సేన ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. ► 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తనవాందే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్ ఆహిర్ గెలుపొందారు. రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది. ► 2014లో శివసేన అభ్యర్థి సునీల్ షిండే గెలుపొందారు. -
స్నేహితులతో గడపాలని యువతిపై..
సాక్షి, ముంబై : యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తన స్నేహితులతో గడపాలని కోరిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్న నిందితుడు ధరన్షా ఈనెల 9న తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తాను కెనడా వెళ్లేందుకు సహకరిస్తారని చెబుతూ తన స్నేహితులతో గడపాలని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 3న కూడా నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడగా తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిందితుడు దౌర్జన్యం చేశాడని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబరుచుకున్న నిందితుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని బాధితురాలు పేర్కొన్నారు. తన వద్ద నుంచి రూ 3 లక్షల నగదు, రూ లక్ష విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌ను తీసుకున్నాడని వాపోయారు. తాము సన్నిహితంగా ఉన్పప్పటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
దక్షిణ ముంబైలోని గిర్గామ్ ప్రాంతంలో గల డ్రీమ్‌లాండ్ థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. త్రిభువన్ దాస్ రోడ్డులోని మెహతా మాన్షన్ అనే వాణిజ్య భవనంలో ఆదివారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు.. మూడో అంతస్తు వరకువ్యాపించాయి. దాంతో భవనం మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు గానీ, మరణించినట్లు గానీ ఇంతవరకు సమాచారం లేదు. ఆరు వాటర్ ట్యాంకర్లతో పాటు తొమ్మిది ఫైరింజన్లను రప్పించి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. -
స్కూల్ ఆవరణలోనే జుట్టు కత్తిరించి..
ముంబయి: తమ కుమారుడిని పాఠశాల గది నుంచి ఈడ్చుకొచ్చి బయట నుంచి బార్బర్‌ను తెప్పించి మరీ హెయిర్ కటింగ్ చేసి అవమానించారని ముంబయిలో ఓ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఉద్దేశ పూర్వకంగా తమ కుమారుడిని కొందరు ఉపాధ్యాయులు ఈ పనిచేయించారని ఆరోపించారు. దక్షిణ ముంబయిలోని పెద్దార్ రోడ్డులో గల యాక్టివిటీ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న పదహారేళ్ల బాలుడికి ఆ స్కూల్ యాజమాన్యం గత నెల 24న స్కూల్ ప్రాంగణంలోనే జుట్టుకత్తిరించింది. దీనిపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎంఎస్సీపీసీఆర్)కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న తమ పిల్లాడికి హెయిర్ కట్ చేయించామని, అయినా మరోసారి ఎందుకు కట్ చేయించాల్సి వచ్చిందని నిలదీశారు. దీనిపై మీడియా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఈ ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. అయితే, స్కూల్ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్‌కు అనుకూలంగా జుట్టు ఉండాలని, ఆమేరకు లేని విద్యార్థులకు స్కూల్లోనే సరిచేయించాలనే ఉద్దేశంతో బార్బర్‌ను తీసుకొచ్చిన మాట వాస్తవం అని చెప్పారు. -
ఈస్టర్న్ ఫ్రీ వే పెంపు
- 17 కి.మీను మరో 1.5 కి.మీ పెంచనున్న ఎమ్మెమ్మార్డీఏ - రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, వ్యయం అవుతుందని అంచనా సాక్షి, ముంబై: ఈస్టర్న్ ఫ్రీ వేను సౌత్ముంబైలోని మింట్ రోడ్ జంక్షన్ వరకు పొడగించనున్నారు. 17 కి.మీ ఉన్న ఫ్రీ వేను మరో 1.5 కి.మీ వరకు పెంచాలని మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) యోచిస్తోంది. ఫ్రీ వే పి.డి.మెల్లో రోడ్ వద్ద ఉన్న ఆరెంజ్ గేట్ వరకు ఉంది. కాగా, కొత్త మార్గం నిర్మాణంతో డాక్టర్ అంబేద్కర్ మార్గ్, ర ఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్, పోర్ట్‌ట్రస్ట్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రద్దీ త గ్గనుంది. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఘాట్కోపర్, సీఎస్‌టీల మధ్య కనెక్టివిటీ త్వరగా పెరుగుతుంది. నిర్మాణం, దానికి సంబంధించిన వ్యయం తదితర అంశాలపై ఫ్రీవే కన్సల్టెంట్లు పరిశీలిస్తున్నారని సంబంధిత అధికారి తెలిపారు. అందుబాటులో ఉన్న స్థలంపై లేన్ల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు. రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, నాలుగు లేన్లకు రెట్టింపు వ్యయం అవుతుందని చెబుతున్నారు. గతంతో ఫ్రీ వేను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ్ నుంచి నిర్మించాలనుకున్నారు. అయితే స్థలం కొరత వల్ల ప్రణాళిక విఫలమైంది. మొదట ఆరెంజ్ గేట్ నుంచి అనిక్ (9.29) వరకు ఎలివేటెడ్ కారిడార్‌గా ఈ మార్గాన్ని నిర్మించారు. తర్వాత చెంబూర్ లోని శివాజీ చౌక (4.3 కి.మీ) వరకు గ్రౌండ్ లెవల్‌గా నిర్మించారు. మూడవ దశలో పంజర్పోల్-ఘాట్కోపర్ మధ్యలో నిర్మించారు. 22 మీటర్ల ఎత్తున్న ఈ బ్రిడ్జి నగరంలోనే ఎత్తైది. -
బెస్ట్‌కు ‘టాటా’..!
సాక్షి, ముంబై: నగరవాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(బెస్ట్)కు టాటా చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. కారణం సుప్రీంకోర్టు ఆదేశాలతో నగరవాసులకు త్వరలో ‘టాటా పవర్’ అందుబాటులోకి రానుంది. ప్రత్యేకించి దక్షిణ ముంబై వాసులకు ఈ టాటా పవర్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లుల విషయంలో బెస్ట్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. బెస్ట్ సంస్థ ఒక్కటే సరఫరా చేస్తుండడంతో చార్జీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. తమ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని కోరుతూ బెస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెస్ట్తోపాటు ఇక్కడ ఎవరైనా(టాటా) విద్యుత్ సరఫరా చేసుకోవచ్చని తీర్పునివ్వడంతో బెస్ట్‌కు చుక్కెదురైంది. సరఫరాదారుల మధ్య ఇకపై పోటీ పెరుగుతుందని, టాటా పవర్ తక్కువ ధరకే లభించనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులపై విద్యుత్ భారం కూడా కొంతమేర తగ్గడమేకాకుండా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. టాటావైపు మొగ్గు... ముంబైలో విద్యుత్ సరఫరా చేసే బెస్టుకు ప్రత్యామ్నాయంగా టాటా విద్యుత్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందరూ అటువైపే మొగ్గుచూపుతున్నారు. భారీ ఎత్తున విద్యుత్‌ను వినియోగించే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, హోటల్స్, కార్యాలయాలు కూడా టాటా విద్యుత్‌వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పరిశీలించినట్టయితే.. బెస్ట్ చార్జీలకంటే టాటా పవర్ కంపెనీ విద్యుత్ చార్జీలు యూనిట్‌కు సుమారు రూ. 1.25 నుంచి రూ. 3.00 వరకు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం గృహ వినియోగదారులకు బెస్ట్ మొదటి 100 యూనిట్ల వరకు రూ.3.20 చొప్పున ప్రతి యూనిట్‌కు వసూలు చేస్తుండగా టాటా పవర్ కంపెనీ మొదటి 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు కేవలం రూ.2.49 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక 100 నుంచి 300 యూనిట్ల వరకు బెస్ట్ ప్రతి యూనిట్‌కు రూ.6.38 వసూలు చేస్తుండగా టాటా కేవలం రూ.4.13 వసూలు చేస్తోంది. 500 యూనిట్లు ఆపై వినియోగదారుల నుంచి బెస్ట్ ప్రతి యూనిట్‌కు రూ.11.40 వసూలు చేస్తుండగా టాటా మాత్రం కేవలం రూ. 9.09 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో అటువైపే నగరవాసులు ఆకర్షితులు అయ్యే అవకాశముందని చెబుతున్నారు. బెస్ట్‌కు మరిన్ని ఇబ్బందులు..? సుప్రీం కోర్టు తీర్పుతో భవిష్యత్తులో బెస్ట్ సంస్థకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సంస్థ ఆర్థిక వ్యవస్థపై ఈ తీర్పు ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెస్ట్‌ను టాటా రాకతో అనేక మంది వినియోగదారులు వీడడం ఖాయంగా కన్పిస్తోంది. బస్సు సేవల్లో బెస్ట్‌కు ప్రతి సంవత్సరం సుమారు రూ.600 నుంచి రూ.700 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై ప్రతి యూనిట్‌పై రూ.0.55 నుంచి రూ. రూ.2.00 అదనపు భారాన్ని మోపుతోంది. దీంతో విద్యుత్ విభాగం పెద్ద ఎత్తున లాభాలబాటలో ఉంది. అయితే బెస్ట్ విధించే చార్జీలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చౌకగా అందుబాటులోకి రానున్న టాటా విద్యుత్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపినట్లయితే బెస్ట్ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని సంస్థలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచుతాం: బెస్ట్ బెస్ట్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఏ సంస్థకైనా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే నగరవాసులు సంతోషాన్ని ఆవిరి చేస్తూ బెస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 300 లోపు యూనిట్ల వినియోగదారుల చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా పవర్ సరఫరా కావడానికి సమయం పడుతుందని చెప్పింది. -
బీఎంసీ అధికారులకు బేడీలు
సాక్షి, ముంబై: డాక్‌యార్డ్ ప్రాంతంలో గత శుక్రవారం భవనం కూలిన ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు బీఎంసీ అధికారులను స్థానిక శివ్డీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన అశోక్ జైన్ అనే డెకొరేటర్ను ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో ఏడుగురు బీఎంసీ అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేయగా 11 మంది పాత్రపై దర్యాప్తుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు అధికారులపై ఆదివారమే సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీఎంసీ ఉన్నతాధికారులు రాజీవ్ జలోటా, మోహన్ అడ్తానితో ద్వీసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో దోషులుగా తేలడంతో డి.సి.చవాన్-డిప్యూటీ సూపరింటెండెంట్ (మార్కెటింగ్ శాఖ). రాహుల్ జాదవ్-అసిస్టెంట్ ఇంజినీర్ (మార్కెటింగ్ శాఖ), ఇన్స్పెక్టర్ (మార్కెటింగ్ శాఖ) జమాల్ కాజీని శివ్డీ పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారిపై విచారణ జరుగుతోంది. ఇందులో ఎంతమంది దోషులుగా తేలుతారో, ఎంతమందిని అరెస్టు చేయాల్సి వస్తుందో త్వరలో వెల్లడవుతుందని కుంటే అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉండగా 28 మంది మహిళలున్నారు. మొత్తం 38 మంది గాయపడగా ఇందులో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 99 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తం 48 గంటల తరువాత భవన శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ 21 కుటుంబాలకు పునరావాసం కల్పించడం పెనుసవాలుగా మారింది. మాడా శరణార్థి శిబిరాలన్నీ కిక్కిరిసి ఉండడంతో వీరికి ఎక్కడ బస కల్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది. డాక్టర్ల సస్పెన్షన్ డాక్‌యార్డ్‌లో భవనం కూలడంతో గాయపడ్డవారికి వైద్యపరీక్షలు నిర్వహించడానికి డబ్బులు వసూలుచేసిన ముగ్గురు నాయర్ ఆస్పత్రి వైద్యులపై సెస్పెండ్ వేటు పడింది. మరో 11 మంది వైద్యులపాత్రపైనా విచారణ జరుగుతోంది. ఇందులో దోషులుగా తేలితే వీరిని కూడా సస్పెండ్ చేయనున్నారు. డాక్‌యార్డ్ దుర్ఘటనలో 61 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరికీ ఉచితంగా వైద్యం అందజేయాలని మేయర్ సునీల్ ప్రభు ఆదేశించారు. అయినప్పటికీ నాయర్ ఆస్పత్రిలోని బాధితుల నుంచి రక్తపరీక్షలు నిర్వహించేందుకు డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని శ్వేతాకాంబ్లే అనే బాధితురాలు బయటపెట్టడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు డాక్టర్లు దోషులుగా తేలడంతో సస్పెండ్ చేశారు.