- 17 కి.మీను మరో 1.5 కి.మీ పెంచనున్న ఎమ్మెమ్మార్డీఏ
- రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, వ్యయం అవుతుందని అంచనా
సాక్షి, ముంబై: ఈస్టర్న్ ఫ్రీ వేను సౌత్‌ముంబైలోని మింట్ రోడ్ జంక్షన్ వరకు పొడగించనున్నారు. 17 కి.మీ ఉన్న ఫ్రీ వేను మరో 1.5 కి.మీ వరకు పెంచాలని మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) యోచిస్తోంది. ఫ్రీ వే పి.డి.మెల్లో రోడ్ వద్ద ఉన్న ఆరెంజ్ గేట్ వరకు ఉంది. కాగా, కొత్త మార్గం నిర్మాణంతో డాక్టర్ అంబేద్కర్ మార్గ్, ర ఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్, పోర్ట్‌ట్రస్ట్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రద్దీ త గ్గనుంది. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఘాట్కోపర్, సీఎస్టీల మధ్య కనెక్టివిటీ త్వరగా పెరుగుతుంది. నిర్మాణం, దానికి సంబంధించిన వ్యయం తదితర అంశాలపై ఫ్రీవే కన్సల్‌టెంట్లు పరిశీలిస్తున్నారని సంబంధిత అధికారి తెలిపారు.
అందుబాటులో ఉన్న స్థలంపై లేన్ల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు. రెండు లేన్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు, నాలుగు లేన్లకు రెట్టింపు వ్యయం అవుతుందని చెబుతున్నారు. గతంతో ఫ్రీ వేను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ్ నుంచి నిర్మించాలనుకున్నారు. అయితే స్థలం కొరత వల్ల ప్రణాళిక విఫలమైంది. మొదట ఆరెంజ్ గేట్ నుంచి అనిక్ (9.29) వరకు ఎలివేటెడ్ కారిడార్‌గా ఈ మార్గాన్ని నిర్మించారు. తర్వాత చెంబూర్ లోని శివాజీ చౌక (4.3 కి.మీ) వరకు గ్రౌండ్ లెవల్‌గా నిర్మించారు. మూడవ దశలో పంజర్‌పోల్-ఘాట్కోపర్ మధ్యలో నిర్మించారు. 22 మీటర్ల ఎత్తున్న ఈ బ్రిడ్జి నగరంలోనే ఎత్తైది.
ఈస్టర్న్ ఫ్రీ వే పెంపు
Published Thu, Apr 23 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement