థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
Published Mon, Oct 31 2016 8:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
దక్షిణ ముంబైలోని గిర్‌గామ్ ప్రాంతంలో గల డ్రీమ్‌లాండ్ థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. త్రిభువన్ దాస్ రోడ్డులోని మెహతా మాన్షన్ అనే వాణిజ్య భవనంలో ఆదివారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు.. మూడో అంతస్తు వరకువ్యాపించాయి.
దాంతో భవనం మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు గానీ, మరణించినట్లు గానీ ఇంతవరకు సమాచారం లేదు. ఆరు వాటర్ ట్యాంకర్లతో పాటు తొమ్మిది ఫైరింజన్లను రప్పించి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
Advertisement
Advertisement