
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగి రావడంతో ఆరంభంలో100 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ వెంటనే సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సోమవారం నాటి ధోరణిని కొటిన్యూ చేస్తున్నాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 61610 వద్ద,నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 18332 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో ఇండెక్స్ లాభాల్లో ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ సూచీలు నష్టాల్లోనూ ఉన్నాయి. బ
ఓఎన్‌జీసీ, హీరో మోటో, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో భారీ లాభాల్లో, కోల్ ఇండియా, ఐటీసీ, టీసీఎస్, సన్‌ఫార్మ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ లూజర్స్‌గానూ కొనసాగుతున్నాయి. ఎల్‌టీఐ-మైండ్‌ట్రీ విలీనం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మైండ్‌ట్రీ 1 శాతం పెరిగింది.
అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.28 వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ఆరంభంలోనే 12 పైసలు ఎగిసింది. కాగా మార్కెట్ ముగింపు తర్వాత విడుదలైన డేటాలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి తగ్గిందని, సెప్టెంబర్‌లో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.41 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment