బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.
2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.
మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.
ఇంద్ర భవనమే!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.
ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు.
మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.
మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment