కీలక మద్దతు స్థాయిలకు పైన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్ ప్రారంభంలోనే 100 పాయింట్లకు పైగా అధిగమించింది. ప్రస్తుతం205 పాయింట్ల లాభంతో 28,169 వద్ద నిఫ్టీ కూడా 53 పాయింట్ల లాభంతో 8,712దగ్గర ట్రేడవుతున్నాయి. దాదాపు అన్నిరంగాలూ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ ,నిఫ్టీ రెండు మద్దతు స్థాయిలను అధిమించాయి. సెన్సెక్స్ 28,000 పాయింట్ల, 8,700 పైన స్థిరంగా ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్స్, రియల్టీ, ఆటో రంగాలు లాభాల్లో ఉన్నాయి.
ముఖ్యంగా ఫలితాలు ప్రకటించనున్న ఆర్ఐఎల్, ఎస్ బ్యాంక్, బయోకాన్, ఎల్ ఐసీ హౌసింగ్ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. వీటితోపాటు ఐడియా, ఐసీఐసీఐ ఓఎన్‌జీసీ, ఇన్ఫ్రాటెల్, యస్‌బ్యాంక్ హెచ్‌సీఎల్ టెక్, భారతీ నష్టాలతోనూ ఉన్నాయి.
అటు రూపాయి 0.05 పైసల నష్టంతో 66.73 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 93 రూపాయలు బలపడి రూ.29,994 దగ్గర ఉంది.