ముంబై: దేశీయ స్టాక్ మార్కట్లు ఫ్లాట్ గా ముశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 28,082 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8708 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఫ్లాట్ నోట్ తోనూ నిఫ్టీ దాని కీలకమైన మద్దతు స్థాయికి 8,700 కి పైన స్థిరంగా ముగిశాయి.ఆరంభం తరువాత 150 పాయింట్లకు పైగా పెరిగిన దలాల్ స్ట్రీల్ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ షేర్ల బలహీనత కారణంగా ఫ్లాట్ గా మారింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ప్రారంభ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు ఎనలిస్టులు భావించారు. అక్టోబర్ 13న క్వార్టర్2 ఫలితాలు ప్రారంభం కావడం కీలకమన్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో భారతదేశం ఉక్కు దిగుమతులు 37.3 శాతం క్షీణించగా, ఎగుమతులు 35.6 పెరిగాయి. దీంతో మెటల్ సెక్టార్ కు భారీ డిమాండ్ ఏర్పడగా, టీసీఎస్,ఇన్ఫోసిస్ లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. 3 శాతం లాభంతో టాటాస్టీల్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఏసీసీ, ఏషియన్ పెయింట్స్, సిప్లా, భారతీ ఇన్ ఫ్రాటెల్ , హిందాల్కో, ఇన్ఫోసిస్, అంబుజా సిమెంట్స్, లూపిన్ షేర్లు లాభపడ్డాయి. బరోడా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, లార్సన్ అండ్ టుబ్రో బ్యాంక్ తదితరాలు నష్టపోయాయి
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత లాభపడింది. 13 పైసల లాభంతో 66.56 వద్దఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 173 రూపాయల లాభంతో రూ.29,751 వద్ద ఉంది.