దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. వరుసగా గత మూడురోజులుగా లాభాల్లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం లాభాలకు బ్రేక్ వేశాయి. ఆరంభంలో పాజిటివ్ గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్ కారణం సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 27,238 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8,400 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగ నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసినప్పటికీ టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. ఎన్టిపిసి, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, గెయిల్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా అధిక లాభాలు ఆర్జించాయి
అటు డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 0.10పైసల నష్టంతో రూ. 68.19 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడిస్వల్ప నష్టాలతో పది గ్రా. రూ. 28,390 వద్ద ఉంది.