ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల వరుస లాభాలతో మురిపించిన స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 25,952వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7994వద్ద ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 140, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మరోసారి మార్కెట్లు కీలక మద్దతుస్థాయిలకు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 26000 నిఫ్టీ 8000 పాయింట్ల కిందికి దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అ టు నేడు డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో మదుపర్ల అప్రమత్తత కొనసాగుతోంది ఎక్కువగా లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపుతుండడటంతో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లలో కూడా అమ్మకాల జోరు కొనసాగుతోంది. టాటా మెటార్స్, లుపిన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసిఐసీఐ, ఎల్ అండ్ టీ సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఆర్ ఐ ఎల్ లాంటి దిగ్గజాలన్నీ కుప్పకూలుతున్నాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు 13 వేల కోట్లకు చేరాయి.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రోజు రోజుకి మరింత క్షీణిస్తోంది. ఆరంభంలోనే 27 పైసల నష్టంతో రూ. 68.83 స్థాయికి దిగజారి 70 కి రికార్డ్ పతనం దిశగా పయనిస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి కూడా భారీ నష్టాలనే నమోదు చేస్తోందివ. పది గ్రా. పుత్తడి 327 రూపాయల నష్టంతో రూ. 28,812 వద్ద ఉంది.
తీవ్ర ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
Published Thu, Nov 24 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement
Advertisement