ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలోనే నెగిటివ్ గా ఉన్న మార్కెట్లు భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మరింత బలహీనపడ్డాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్28,000 పాయింట్ల మద్దతునుంచి, నిఫ్టీ 8650 స్తాయినుంచి దిగజారింది. సెన్సెక్స్ 27.877 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 8632వద్ద ట్రేడవుతోంది. అటు అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గురువారంతో ముగియనున్న నేపథ్యం కూడా మదుపర్లు సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో దాదాపు అన్ని రంగాలూ రెడ్ గానే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ, మెటల్స్ రంగాలు నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఫలితాలతో 6.2 శాతం పతనమైంది. ఏషియన్ ఫెయింట్స్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, అరబిందో, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో క్షీణించాయి. క్యూ2 ఫలితాలు అంచనాలతో భారతీ ఎయిర్ టెల్ లాభపడుతుండగా, హీరోమోటో, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ ఇదే బాటలోఉన్నాయి.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి స్వల్ప లాభాలతో ఉంది. 0.01పైసల లాభంతో 66.82 వద్ద ఉంది. అయితే ఈ రోజు పసిడి జోరుగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 202 రూపాయల లాభంతో 29,965వద్ద ఉంది.
200 పాయింట్లకు పైగా కుప్పకూలిన మార్కెట్లు
Published Wed, Oct 26 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement